

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బర్కత్‌పుర్ లో తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఉన్మాదానికి లోనైన భరత్, కొబ్బరిబొండాలను కొట్టే కత్తితో దాడిచేయగా, తీవ్రంగా గాయపడి మలక్ పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించాయి. మరో 48 గంటలు గడిస్తేగాని మధులిక పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని వైద్యులు చెప్పారు.
వెంటిలేటర్ పై చికిత్స…

ఆమె శరీరంపై 14 చోట్ల కత్తిగాట్లు ఉన్నాయని, తల పైభాగంలో పుర్రె రెండుగా చీలి, పూర్తిగా నరాలు తెగిపోయాయని, లోలోపల రక్తస్రావం అధికంగా ఉందని, దవడ వద్ద, మణికట్టులపై, అరచేతులపై బలమైన గాయాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకూ ఆమెకు 5 బాటిళ్ల రక్తం ఎక్కించినట్టు డాక్టర్స్ చెప్పారు.
అమ్మాయికి గాయాలైన తరువాత ఆసుపత్రికి తీసుకు వచ్చే సరికే ఆమె పల్స్, బీపీ పడిపోయాయని, వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని వెల్లడించారు. రక్తస్రావం ఆగి, రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చిన తరువాత ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సివుందని చెప్పారు. మరోవైపు దాడి చేసిన వాడిని పోలీసులు పట్టుకొని కోర్టు ముందు హాజరుపర్చారు.
చదవండి : నడిరోడ్డుపై ప్రేమోన్మాది ఘాతుకం…అమ్మాయి పరిస్థితి విషమం!








