26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై చలించిపోయిన మోహన్ బాబు!

విద్యార్థుల ఆత్మహత్యలపై చలించిపోయిన మోహన్ బాబు!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వ్యవహారంలో అనేకమంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుండడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. దేవుడు జీవితాన్ని ఇచ్చింది చివరి శ్వాస వరకు జీవించడానికే తప్ప, అర్ధంతరంగా ముగించడానికి కాదని స్పష్టం చేశారు.

ఓ విద్యాసంస్థ అధిపతిగా వేల మంది విద్యార్థుల్లో మనోస్థయిర్యం కలిగిస్తున్న తనకు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు ఎంతో వేదన కలిగిస్తున్నాయని తెలిపారు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అలాంటి నిర్ణయాల వల్ల మీపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను శిక్షించిన వాళ్లవుతారు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.

కేవలం మార్కులు రాలేదన్న కారణంతో జీవితాన్ని అంతం చేసుకుని తల్లిదండ్రులను, బంధుమిత్రులను క్షోభ పెట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై కొద్దిసేపు ముందే మంచు విష్ణు కూడా తనదైన రీతిలో స్పందించాడు.

చదవండి:  హాలీవుడ్ సినిమాలకి టాలీవుడ్ సినిమాలకి తేడా ఇదే!

- Advertisement -