

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి, సామాజిక కార్యకర్త ఉపాసన పెట్టిన ట్వీట్‌కు తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇటీవల దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి ఉపాసన హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి తనవంతు సాయం చేసేందుకు ఫోరంలోని తెలంగాణ డెస్క్‌కు కోఆర్డినేటర్‌గా ఉపాసన వ్యవహరించారు.
నా కొత్త ఉద్యోగం: ఉపాసన
ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ‘నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్ సర్’ అంటూ ఆయనకు ట్వీట్ చేశారు. దీనిపై తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు కేటీఆర్ స్పందిస్తూ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘ఉపాసన చేస్తున్న పనితో తమ బృంద సభ్యుల్లో ఉత్తేజం రెట్టింపవుతుంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఉపాసన ట్విట్టర్‌లో ఇలా వ్యాఖ్యానించారు..‘నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్ సర్? వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్ వెళ్లాను. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ డెస్క్‌లో కూర్చున్నాను’ అని వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.
అంతేగాక, ఈ సందర్భంగా ఆమె మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు. ప్రపంచంలో అత్యాధునిక హెల్త్‌కేర్ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు తెలిపారు.
How do u like my new job ? @KTRTRS garu. Sitting behind the desk at the #Telangana Pavilion @wef helping the fab team with #investintelangana –
#3 on the world’s best place to live ??
Startup Capital of India ??
#1 in ease of doing business??
Just got to love #Hyderabad !!!! pic.twitter.com/Qslt7ruekF— Upasana Konidela (@upasanakonidela) January 24, 2019
Many thanks Upasana ? Nice of you to lift the spirits of our team https://t.co/iz4TCCrQPV
— KTR (@KTRTRS) January 24, 2019








