33.1 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ రూ.10 వేలు, స్మార్ట్‌ఫోన్లు: డ్వాక్రా మహిళలకు చంద్రబాబు వరాలు

రూ.10 వేలు, స్మార్ట్‌ఫోన్లు: డ్వాక్రా మహిళలకు చంద్రబాబు వరాలు

cbn
- Advertisement -

గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలపై వరాలు కురిపించారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో శుక్రవారం నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ కింద రూ.21,116 కోట్లు అందజేశామని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మూడు విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామన్నారు. దీనికోసం మొత్తం రూ.9,400 కోట్లు ఇస్తున్నామని.. వడ్డీమాఫీ కోసం రూ.11,118 కోట్లు చెల్లించామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా మహిళలకు రూ.20వేలు సాయం చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

రూ.10 వేలతోపాటు స్మార్ట్ ఫోన్లు…

తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకస్థానం ఉంటుందని.. వారికి స్మార్ట్‌ఫోన్‌ కూడా అందజేస్తామని సీఎం ప్రకటించారు. కోటి 40 లక్షల మందికి అందిస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్‌తో అన్ని పనులను ఇంట్లో నుంచే చక్కబెట్టుకోవచ్చన్నారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

మహిళల ఆరోగ్యంపై త్వరలో హెల్త్‌ కార్డులు కూడా రూపొందిస్తామని వెల్లడించారు.ప్రకృతి సేద్యం పెరగాలని, ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రపంచానికి ప్రకృతి సేద్యం అనే బహుమానాన్ని మన రాష్ట్రమే ఇవ్వాలని చెప్పారు. 94 లక్షల మందికి రూ.10 వేలు ఇవ్వడం ద్వారా కుటుంబ ఆదాయం పెంచడమే తమ లక్ష్యమన్నారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మహిళలకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని ప్రభుత్వాలు కూడా తమకు తోచిన విధంగా ఇలాంటి వరాలు కురిపించడం సాధారణమైపోయింది.

- Advertisement -