
హైదరాబాద్: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ఫీవర్ చుట్టుముట్టింది. అన్ని పార్టీలు కూడా అధికారమే లక్ష్యంగా తమ వ్యూహాలకి పదునుపెడుతున్నారు. విమర్శలు , ప్రతివిమర్శలతో మొత్తం రాజకీయ రణరంగంలా మారిపోయింది. కాగ నేడు తెరాస కీలక నేత కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు పై నిప్పులుచెరిగాడు.
చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం గోప్యత చట్టానికి తూట్లు పొడిచిందన్న కేటీఆర్.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
మీకు ఓటేయాల్సింది ప్రజలేనని గుర్తుపెట్టుకోండి…
టీడీపీ అధినాయకత్వం కొందరు వ్యక్తులకు నగదు చెల్లించి ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. బోట్స్(ఆటోమేటిక్ గా ట్వీట్లను రీట్వీట్ చేసే సాఫ్ట్ వేర్లు) సాయంతో తమ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పెయిడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా టీడీపీ అధినాయకత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తోంది. చంద్రబాబు గారూ.. మీరు నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కొనుగోలు చేయవచ్చు.
కానీ ఎన్నికల్లో మీకు ఓటేయాల్సింది మాత్రం నిజమైన ప్రజలేనని గుర్తుపెట్టుకోండి. ఓసారి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఇప్పుడు మళ్లీ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారంలో అడ్డంగా దొరికారు’ అని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు.
TDP leadership's sinister plan to defame Telangana government by using paid twitter handles exposed. You could buy tweets from fake handles @ncbn Garu, but don't forget that you need real voters to vote for you!
Caught in #CashForVotes once and now again at it with #CashForTweet pic.twitter.com/OlMOeJLUhV
— KTR (@KTRTRS) March 5, 2019
చదవండి: టీడీపీని హడలెత్తిస్తున్న గుంటూరు జిల్లా తాజా సర్వే! ఎవరికెన్ని సీట్లో చూడండి!








