22.2 C
Hyderabad
Sunday, November 29, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు! పవన్ కళ్యాణ్‌తో ఎమ్మెల్సీ మాగంటి భేటీ

టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు! పవన్ కళ్యాణ్‌తో ఎమ్మెల్సీ మాగంటి భేటీ

- Advertisement -

ప్రకాశం: తాజా పరిణామాలను చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలానే ఉంది. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ కావడమే ఇందుకు కారణం. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నపవన్ కళ్యాణ్‌ను.. ఆయన ఒంగోలులోని బృందావనం కళ్యాణ మండపంలో భేటీ అయ్యారు.

దాదాపు 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశం కొనసాగింది. అయితే, మర్యాదపూర్వకంగా కలిశానని, కుటుంబ విషయాలు మాట్లాడుకున్నామని చెప్పి మాగుంట అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, రాజకీయాల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పార్టీ మార్పు ఖాయమేనా.?

కాగా, టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయంలో స్పష్టతలేదు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి… పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం సాగింది.

అయితే, చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నట్లు కనిపించారు. కానీ, టీడీపీలో మాత్రం కొనసాగేందుకు ఇష్టం లేనట్లు తెలిసింది. అందుకే నేటి భేటీ జరిగినట్లు సమాచారం.

కాగా, తాజా పరిణామాలు గమనించినట్లయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై అటు జనసేన అధినేత కానీ, మాగుంట కానీ స్పష్టతనివ్వకపోవడంతో ఉత్కంఠగా మారింది.

చదవండి: చంద్రబాబుకు మరో షాక్: టీడీపీని వీడిన చల్లా, త్వరలో వైసీపీలోకి!

- Advertisement -