26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఈ వయస్సులో పార్టీల చుట్టూ తిరగడం చూస్తే సిగ్గుగా ఉంది : మాజీమంత్రి డిఎల్

ఈ వయస్సులో పార్టీల చుట్టూ తిరగడం చూస్తే సిగ్గుగా ఉంది : మాజీమంత్రి డిఎల్

dl
- Advertisement -

కడప: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో డిఎల్ రవీంద్రారెడ్డి తనదైన ముద్రవేసాడు. ఆ తరువాత రాష్ట్రం రెండు ముక్కులుగా విడిపోయిన తరువాత అప్పటి పరిస్థితులని బట్టి పోయిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. కాగ డిఎల్ మళ్ళీ కొన్ని రోజులుగా రాజకీయాలలో బిజీగా ఉన్నాడు. దీనితో మళ్ళీ ఈ వయస్సులో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్నాడు.

ఈ తరుణంలో డిఎల్ వైసీపీలో చేరుతాడని, కాదు టీడీపీలోనే చేరతాడని రకరకాల పుకార్లు వచ్చాయి. దానికి అనుగుణంగానే డిఎల్ సీఎం చంద్రబాబుని అమరావతిలో కలిసాడు. కానీ డిఎల్ ఆశించిన మైదుకూరు టికెట్ ని ప్రస్తుత టీటీడీ చైర్మైన్ పుట్టా సుధాకర్ యాదవ్ కి టీడీపీ అధిష్టానం కేటాయించింది. ఈ సమయంలో డిఎల్ ఒక సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పై , పుట్టా సుధాకర్ పై నిప్పులు చెరిగాడు.

మాలాంటివారు తలచుకుంటే టీడీపీని పెకలించివేస్తాం..

అయన మాట్లాడుతూ…ఎంతోమందికి బీఫారాలు ఇప్పించానని, ఈ వయస్సులో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ దగ్గరకు పోయి బీఫారం అడుగుతుంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, మరోసారి ఓటు వేయిచుకునేందుకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకున్నానని చెప్పారు. ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాన్నారు.

రాజకీయాల గురించి కొత్తగా నేర్చుకొనేది ఏమీ లేదని చెప్పారు. తనకు వ్యాపారాలు లేవని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో తన కుంటుంబానికి పనిలేదని అన్నారు. రఘురామిరెడ్డి ప్రత్యర్థిగా ఉన్నా ఇంత దురదృష్టకరంగా పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. డబ్బు ఉండవచ్చని, చాలా మంది కోటీశ్వరులు ఉన్నారని, డబ్బుతో గెలిచి అందరినీ వేధించాలని అనుకుంటున్నారేమో.. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతామని సుధాకర్‌ను డీఎల్‌ హెచ్చరించారు.

ఈ వయస్సులో పార్టీల చుట్టూ తిరగడం చూస్తే సిగ్గుగా ఉందన్నారు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎందరికో బీఫారం ఇప్పించిన మనిషిని ఇప్పుడు తన బీఫారం కోసం టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీల దగ్గరకు పోవడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశా.. పార్టీ చందా ఇస్తాడని సుధాకర్‌కు టికెట్‌ ఇస్తున్నానని చెప్పినా నేను బాధపడేవాన్ని కాదు.

టీడీపిని సాధించాలి, పునాదులు లేకుండా చేయాలి.. నా ఆలోచనలకు తోడు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గెలిపిస్తాను. 1978లో ఇందిరా గాలి వీస్తున్నా స్వతంత్రులు, రెడ్డి కాంగ్రెస్‌ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు. మాలాంటి నేతల సేవలు ఉపయోగించుకుంటే జిల్లాలో టీడీపీని కూకటివేళ్ళతో పెకలిస్తాం.

చదవండి: టీడీపీని హడలెత్తిస్తున్న గుంటూరు జిల్లా తాజా సర్వే! ఎవరికెన్ని సీట్లో చూడండి!

- Advertisement -