
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలంటే రాజీనామా చేశాకే అవకాశం ఇస్తామన్న జగన్ నిర్ణయం గొప్పదన్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అన్నారు.
చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్ అక్షరాభ్యాసం
కనీసం జగన్ నిర్ణయంతోనైనా తెలంగాణ సీఎం కేసీఆర్‌లో మార్పురావాలన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కేసీఆర్ జగన్‌ను చూసి నేర్చుకోవాలంటూ విజయశాంతి హితవు పలికారు.
స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ఫిరాయింపులకు పాల్పడుతున్న కేసీఆర్… ఇకనైనా అలాంటివి మానుకోవాలన్నారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం దుర్మార్గపు చర్య అని ఆమె మండిపడ్డారు.
జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని… ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పాటిస్తే బాగుంటుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.








