
గుంటూరు: కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది అని విమర్శించారు వైసీపీ నాయకుడు, సినీ నటుడు పృథ్వీ. కే ట్యాక్స్ గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యం వేసిందన్నారు.
చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్ అక్షరాభ్యాసం
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైనప్పుడు ఫస్ట్ టైం ఈ కే ట్యాక్స్ గురించి విన్నానని తెలిపారు. స్థానికులు తనకు ఈ కే ట్యాక్స్ గురించి వివరించారన్నారు.
ఇక్కడ బిల్డింగ్లు కట్టాలన్నా, కాంప్లెక్స్‌లకు పునాది పడాలన్నా కే టాక్స్ చెల్లించాల్సిందే అని చెప్పారని, ఏదైనా బిజినెస్‌లో రూ. లక్ష రూపాయలు పెడితే రూ.20 వేలు ట్యాక్స్ కింద పే చేయాల్సి వస్తుందని తనతో వాపోయారన్నారు పృథ్వీ.
సినిమాల్లో రౌడీ షీటర్లలా… కోడెల పీఏ ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేయాల్సిన అవసరం మాకేంటి అని పృథ్వీ ప్రశ్నించారు. కాగా కే టాక్స్ విషయంలో కోడెల కూతురు, కుమారుడిపై ఇప్పటికే కేసులు నమోదు కాగా… వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.








