

హైదరాబాద్: నగరంలోని ప్రేమజంటలకు హద్దుపద్దూ లేకుండా పోతోంది. రద్దీలేని మెట్రోరైలు స్టేషన్ల లిప్టులు ప్రేమికులు తమ కామ కలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రయాణికుల(వృద్ధులు, వికలాంగులు) సౌకర్యార్థం స్టేషన్‌కు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల్లో ప్రేమికులు సాగుతున్న కామకలాపాలు విస్మయం కల్గిస్తున్నాయి.
లిప్టుల్లో యువజంటల ముద్దు దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా, బయటకొచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మెట్రోలోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తుంటారు.
యువతి, యువకుల కామ కలాపాలను గుర్తించిన మెట్రో అధికారులు ఇప్పటికే స్టేషన్లలో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో హుందాగా ఉండాలనే సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, వైరల్‌గా వీడియోలు మెట్రో అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ ఘటనలపై విచారణ చేస్తున్నట్లు, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.








