హైదరాబాద్‌లో ప్రారంభమైన మెట్రో సేవలు

- Advertisement -

హైదరాబాద్: ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ పట్టాలెక్కింది. అన్‌లాక్ 4లో భాగంగా కేంద్రం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో కారిడార్ 1లో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో రైలు కూతపెట్టింది.

ఉదయం ఏడు గంటలకు తొలి రైలు పరుగులు తీసింది. ఈ మార్గంలో మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి. అందులో కంటెయిన్‌మెంట్ జోన్లు అయిన మూసాపేట, భరత్‌నగర్ స్టేషన్లను మూసివేశారు.

మిగతా స్టేషన్లలో ప్రతీ ఐదు నిమిషాలకు ఓ రైలు నడవనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడవనున్నాయి.

రేపటి నుంచి కారిడార్ 3లోని నాగోల్-రాయదుర్గం మధ్య, బుధవారం నుంచి మూడు మార్గాల్లోనూ రైళ్లు నడవనున్నాయి.

- Advertisement -