
- Advertisement -
హుజూర్‌నగర్: మరికాసేపట్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించిన కౌంటింగ్ సిబ్బంది అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్, ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు మొత్తం 22 రౌండ్లలో జరగనుండగా, ఇందుకో సం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమక్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి బరిలో ఉన్నారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట కోవడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. తెలుగుదేశం, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
- Advertisement -








