సినీ నిర్మాత సురేష్‌బాబుపై కేసు నమోదు, ఏం జరిగిందంటే…

Suresh Babu1
- Advertisement -

Suresh Babu

సికింద్రాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబుపై సికింద్రాబాద్‌ ఖార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. సురేష్‌ బాబు ప్రయాణిస్తోన్న కారు ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.  ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తోన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  దీంతో పోలీసులు సురేష్ బాబుపై కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం… ఖార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద సురేష్‌బాబు ప్రయాణిస్తోన్న టీఎస్‌09ఈఎక్స్‌2668 కారు అటుగా వెళుతున్నఓ  బైక్‌‌ను ఢీకొంది.  దీంతో ఆ బైక్‌పై వెళుతున్న దంపతులతో పాటు వారి కుమారుడు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సతీష్‌ చంద్ర(35), దుర్గా దేవి(30), సిద్దేశ్‌ చంద్ర(3)లు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ ముగ్గురిని యశోద ఆసుపత్రికి తరలించారు,

దీంతో ఖార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌పై కేసు నమోదు చేశారు.  ఆయనకు 41-ఎ కింద నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -