29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ నేడు కొత్తగా 42 కరోనా కేసులు.. 1500 మార్క్ దాటేసిన తెలంగాణ

నేడు కొత్తగా 42 కరోనా కేసులు.. 1500 మార్క్ దాటేసిన తెలంగాణ

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతోంది. నేడు కొత్తగా 42 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదు కావడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. 

తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇప్పటివరకూ మొత్తం 1,551 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం 21 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వీరితో కలుపుకుని  ఇప్పటివరకు మొత్తం 992 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా 57 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 525 మందికి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు, రాత్రిపూట కర్ఫ్యూ యధాతథం…
చదవండి: లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే.. వెల్లడించిన కేంద్రం, హాట్‌స్పాట్‌లలో ఆంక్షలు మరింత కఠినం…
చదవండి: లాక్‌డౌన్ 4.0లో దుకాణదారులకు భారీ ఊరట
- Advertisement -