26.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ప్రతిపక్ష హోదా కావాలంటున్న అసదుద్దీన్…

ప్రతిపక్ష హోదా కావాలంటున్న అసదుద్దీన్…

asaduddin-owaisi
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు చెందిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్‌లో కలిసిపోయిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ…కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంకెంతమాత్రం రెండో పెద్ద పార్టీ కానందున తమ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీలో తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నందున రెండో పెద్ద పార్టీగా గుర్తించాలని అన్నారు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత పదవి కోరేందుకు త్వరలోనే తాము తెలంగాణ స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు.

ఇక టీఎర్ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం అవ్వడాన్ని ఒవైసీ సమర్ధించారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో విధేయత చాటాలనుకుంటే చట్టం అనుమతిస్తోందని, టీఆర్ఎస్‌లో చేరాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకుంటే అందులో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరి చూడాలి స్పీకర్ ఎం‌ఐ‌ఎం పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పిస్తారో లేదో.

చదవండి: కేసీఆర్‌ని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్: టీ కాంగ్రెస్

- Advertisement -