22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్ సంచలన నిర్ణయం: ఏపీ హోం మంత్రిగా సుచరిత…మిగిలిన వారి శాఖలు ఇవే

జగన్ సంచలన నిర్ణయం: ఏపీ హోం మంత్రిగా సుచరిత…మిగిలిన వారి శాఖలు ఇవే

Ap Cabinet, YS jagan Latest News, AP Ministers Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఈరోజు జరిగిన విషయం తెల్సిందే. మొత్తం 25 మంది జగన్ కేబినెట్‌లో కొలువుదీరారు. అయితే కొద్దిసేపటి క్రితమే వీరికి శాఖలు కేటాయించారు.

ఈ క్రమంలోనే గుంటూరు ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరితని హోం మంత్రిగా నియమించారు.   అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయితీ రాజ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్ధిక శాఖలు అప్పగించారు. ఇక పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, నారాయణస్వామి, అంజాద్ బాషాలు ఉపముఖ్యమంత్రులుగా సీఎం జగన్ కు పరిపాలనలో సహకారం అందించనున్నారు.

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు వివరాలు

  • మేకతోటి సుచరిత – హోంశాఖ
  • పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమం
  • ధర్మాన కృష్ణదాస్ – రోడ్లు, భవనాల శాఖ
  • బొత్స సత్యనారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
  • అవంతి శ్రీనివాస్ – పర్యాటక శాఖ, కల్చరల్ యూత్ అడ్వాన్స్ మెంట్
  • మేకపాటి గౌతంరెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
  • అనిల్ కుమార్ యాదవ్ – జలవనరులు, నీటిపారుదల శాఖ
  • కురసాల కన్నబాబు – వ్యవసాయ శాఖ
  • తానేటి వనిత – మహిళా శిశుసంక్షేమం
  • కొడాలి నాని – పౌరసరఫరాల శాఖ
  • పేర్ని నాని –రవాణా శాఖ
  • మోపిదేవి వెంకటరమణ – పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్
  • పినిపె విశ్వరూప్ – సాంఘిక సంక్షేమ శాఖ
  • ఆళ్ల నాని – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • పిల్లి సుభాష్ చంద్రబోగ్స్ – రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
  • వెల్లంపల్లి శ్రీనివాస్ – దేవాదాయ శాఖ
  • గుమ్మనూరి జయరాం – కార్మిక, ఉపాధి శాఖ
  • బాలినేని శ్రీనివాసరెడ్డి – విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • ఆదిమూలపు సురేశ్ – విద్యాశాఖ
  • పెద్దిరెడ్డి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
  • బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
  • అంజాద్ భాషా –  మైనారిటీ వ్యవహారాల శాఖ
  • నారాయణస్వామి – ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
  • శంకర్ నారాయణ – బీసీ సంక్షేమ శాఖ
  • శ్రీరంగనాథరాజు – గృహనిర్మాణశాఖ

చదవండి: పవన్‌కు షాక్: జనసేనకి రావెల గుడ్‌బై…
- Advertisement -