26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మహేశ్ ఇమేజ్ వల్లే నిజం సినిమా ఫ్లాప్ అయింది: డైరెక్టర్ తేజ

మహేశ్ ఇమేజ్ వల్లే నిజం సినిమా ఫ్లాప్ అయింది: డైరెక్టర్ తేజ

- Advertisement -

హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతని తెచ్చుకున్న డైరెక్టర్ తేజ. ఎప్పటికప్పుడూ ఇండస్ట్రీకి కొత్త హీరో హీరోయిన్లని అందించిన తేజ….సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కూడా ఓ సినిమా తీశారు.

మహేశ్ హీరోగా తెరకెక్కిన నిజం చిత్రం పెద్దగా హిట్ అవ్వకపోయిన…మహేశ్‌కి మాత్రం నంది అవార్డు తీసుకొచ్చింది, అయితే నిజం సినిమా ఫ్లాప్ అవ్వడానికి మహేశ్ ఇమేజ్ నే కారణమని తేజ ఓ మీడియా చానల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మహేశ్ బాబుతో తాను చేసిన ‘నిజం’ చాలా వివిభిన్నమైన సినిమా అని, అయితే ఈ సినిమాకంటే ముందుగా మహేశ్ చేసిన ‘ఒక్కడు’ విడుదలైందని చెప్పారు. దాంతో ఒక్కసారిగా మహేశ్ బాబు ఇమేజ్ మారిపోయిందని, అందువల్లనే ఆ తరువాత వచ్చిన ‘నిజం’ సినిమాలో మహేశ్ బాబును తను చూపించినట్టుగా చూడలేకపోయారని అన్నారు.

మహేశ్ బాబు ఇమేజ్ కథకి అడ్డం పడటం వల్లనే ఆ సినిమా పరాజయంపాలైందని చెప్పుకొచ్చారు.

చదవండి: దేవుడా…! ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న జక్కన్న…
- Advertisement -