27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణలో చిరంజీవి ఎన్నికల ప్రచారం! ఎవరి కోసమో తెలుసా?

తెలంగాణలో చిరంజీవి ఎన్నికల ప్రచారం! ఎవరి కోసమో తెలుసా?

Mega Star Latest Political News, Telangana Latest Political News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: గత కొంత కాలంగా రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి. అయితే, ఆయన ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చేవెళ్ల నుండి పోటీకి దిగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తరపున చిరంజీవి.. వికారాబాద్ నియోకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కాగా, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డితో చిరు కుటుంబానికి బంధుత్వం ఉంది. అందుకోసమే ప్రచారం చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

సోనియాతోపాటు చిరు ప్రచారం..

ఏప్రిల్ 8వ తేదీన చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు చిరు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

అయితే, గత కొంత కాలంగా సినిమాలకు దగ్గరవుతున్న చిరంజీవి.. రాజకీయాలకు దూరమయ్యారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన సైరా నర్సింహారెడ్డి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: లోకేష్ నకిలీ ..ఎన్టీఆర్ ఒరిజినల్! వర్మ సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -