తెలంగాణలో కొత్తగా 2,426 పాజిటివ్ కేసులు.. 940కి చేరిన మొత్తం మరణాలు…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా పాజిటివ్ కేసుదు నమోదు అయ్యాయి. 

అలాగే కరోనా బారిన పడి రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 13 మంది మరణించాు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.  

దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,52,602కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 940కి చేరింది. 

మరోవైపు గురువారం ఒక్కరోజే 2,324 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,19,467కి చేరింది. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 32,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 25,240 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 62,890 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 20,16,451కి చేరింది. 

చదవండి: ఏపీలో ఒక్కరోజులో 10,418 కొత్త కేసులు.. 4,634కు చేరిన మొత్తం మరణాలు…
- Advertisement -