10 లక్షలు పలికిన టీఎస్ 09 ఎఫ్ఈ 9999 !

10:06 am, Tue, 16 April 19

హైదరాబాద్: ఫ్యాన్సీ వాహన నంబర్లను వేలం వేయడం ద్వారా ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ నుంచి రవాణా శాఖ మొత్తం రూ. 30.55 లక్షల ఆదాయాన్ని ఖజానాకు చేర్చింది. ‘టీఎస్ 09 ఎఫ్ఎఫ్’ సిరీస్ ప్రారంభం అయింది.

టీఎస్ 09 ఎఫ్ఈ’ సిరీస్ లో 9999 నంబర్ ను ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ సంస్థ ఏకంగా రూ. 10 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ఇక ఎఫ్ఎఫ్ సిరీస్ లో 1 నంబర్ ను ఎఫ్ఆర్ఆర్ హిల్స్ హోటల్స్ రూ. 6.95 లక్షలు చెల్లించి సొంతం చేసుకోగా, 99 నంబర్ ను రూ. 2.78 లక్షలకు అగ్రినోవో కంపెనీ దక్కించుకుంది.

ఎంతో డిమాండ్ ఉంటుందని భావించిన 9 నంబర్ కు కేవలం రూ. 50 వేలు మాత్రమే వచ్చింది. ‘0001’ నంబర్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య దాడి జరగడం గమనార్హం. సమయం ముగిసిన తరువాత నంబర్ కోసం టెండర్ వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని, మరో వ్యక్తి అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగింది. అధికారులు సైతం సమయం ముగిసిందంటూ, అతని దరఖాస్తును తిరస్కరించారు