టీడీపీకి అతి పెద్ద ఎదురుదెబ్బ! ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతే..!!

Chandrababu Naidu News, AP High Court Latest News, AP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ మరువకముందే తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గట్టి షాక్ ఇచ్చారు.

దీన్నుంచి కూడా తేరుకోకమునుపే ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడికి మరో అతి పెద్ద దెబ్బతగిలింది.  రాజ్యసభ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పి కనీసం 24 గంటలు కూడా గడువకమునుపే, ఈసారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి భారీ షాక్ ఇవ్వబోతునట్టుగా తెలుస్తోంది.

మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలతో కలసి గంటా శ్రీనివాసరావు శ్రీలంకలోని కొలంబోలో ఉన్నారని, వారంతా కొలంబో నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. 

అయితే, ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 11న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు.

అయితే, ఆ 23 మందిలో ఇప్పుడు గంటాతో కలిసి 16 మంది బీజేపీలోకి జంప్ గనుక అయితే, ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అలాగే మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కదు.

ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ కమలం కండువాలు కప్పుకొన్నారు.

బీజేపీ నేత చెప్పినట్లుగానే…

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి టీడీపీ ఎమ్మెల్యేల్లో మూడొంతుల మంది బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గంటా అండ్ టీమ్‌ను మనసులో పెట్టుకునే ఆయన ఈ కామెంట్స్ చేసినట్టు సమాచారం.

గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ లోకేష్‌ ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు. అయితే ఎన్నికల తర్వాత నుంచి గంటా మౌనంగానే ఉన్నారు. పెద్దగా ఎక్కడా వార్తల్లో కనిపించలేదు.

గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లిన గంటా శ్రీనివాసరావు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు మంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి భీమిలి నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేలోపు టీడీపీ పూర్తిగా కాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

- Advertisement -