
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా మరో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. రూ.299, రూ.499, రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్లపై డబుల్ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది.
వొడాఫోన్ ఐడియా ఇటీవల ఎంపిక చేసిన సర్కిళ్లలో రూ. 399, రూ. 599 ప్లాన్లపై డబుల్ డేటా ప్రయోజనాలను పరిమితం చేసింది.
తాజాగా ఇప్పుడు మరిన్న ప్లాన్లపై డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. తాజా ఆఫర్ 9 సర్కిళ్లలో అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్లలో వొడాఫోన్ ప్లే, జీ5, ఐడియా మూవీస్, టీవీ కంటెంట్‌ను కూడా ఉచింతంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
రూ.229 ప్లాన్‌లో అదనంగా 2 జీబీ హైస్పీడ్ డేటా లభించనుంది. అంతే మొత్తం 4జీబీ డేటా లభిస్తుంది. అలాగే, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.
రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 4 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 56 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.
రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌లోనూ ఇవే ప్రయోజనాలు లభించనుండగా కాలపరిమితి మాత్రం 84 రోజులు.








