22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం భారీగా తగ్గిన పసిడి ! బంగారం బాటలోనే వెండి!

భారీగా తగ్గిన పసిడి ! బంగారం బాటలోనే వెండి!

gold
- Advertisement -

హైదరాబాద్: పసిడి ధర సోమవారం పడిపోయింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,720కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా బలహీన అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు ప్రధాన కారణం.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పతనమై రూ.37,350కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 1,276.25 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 14.39 డాలర్లకు ఎగసింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,550కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.

కేజీ వెండి ధర రూ.250 తగ్గుదలతో రూ.37,350కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.420 పతనమై రూ.36,160కు దిగొచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000కు, అమ్మకం ధర రూ.80,000కు తగ్గింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,670కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,160కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,100కు దిగొచ్చింది.

- Advertisement -