28.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మధ్యప్రదేశ్‌లో విషాదం.. లిఫ్ట్ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో విషాదం.. లిఫ్ట్ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. ఓ బిల్డింగ్‌కు ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ కూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం ఇండోర్‌లోని పాటల్‌పానీలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా విషాదం నింపింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఇండోర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మభూలోని ఓ ఫామ్ హౌస్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలిపారు.

మృతుల్లో వ్యాపారి పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పలక్ (27)తోపాటు ఆయన కుటుంబంలోని మరో నలుగురు మృతి చెందారు. మరొకరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ ఎందుకు కూలిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -