26.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పుల్వామా ఉగ్రదాడి: విషం కక్కిన పాకిస్తాన్ మీడియా, ఆ ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులట!

పుల్వామా ఉగ్రదాడి: విషం కక్కిన పాకిస్తాన్ మీడియా, ఆ ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులట!

pakistan-the-nation-about-pulwama-terror-attack
- Advertisement -

pulwama-terror-attack-1

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని అవంతిపురలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుంటే.. పాకిస్తాన్ మీడియా మాత్రం విషం కక్కుతోంది. గురువారం 2,547 సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న కాన్వయ్‌పై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌‌కు చెందిన ముష్కరులు ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ఇక చూస్తూ ఊరుకోమని, పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని, వారికి ఆశ్రయం ఇవ్వడం నిలిపివేయాలని, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

స్వాతంత్య్ర సమరయోధులు జరిపిన దాడిలో…

అయితే, ఎవరెన్ని చెబుతున్నా, హెచ్చరిస్తున్నా పాకిస్తాన్ మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదనే చెబుతోంది. పైగా ముష్కర దాడిపై పాకిస్తాన్ మీడియా భిన్నంగా స్పందించింది. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొంది. ‘ద నేషన్’ అనే పత్రిక.. ‘‘స్వాతంత్య్ర సమరయోధులు జరిపిన దాడిలో 44 మంది భారత ఆక్రమిత కశ్మీర్ (ఐఓకే) దళ సభ్యులు మృతిచెందారు..’’ అని పేర్కొంది.

‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ అనే పత్రిక అయితే పుల్వామా దాడి ఘటన వార్తలో కశ్మీర్‌ను ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని పేర్కొంది. ఇంకా మరికొన్ని పత్రికలు కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగానే వార్తలు ప్రచురించాయి. పుల్వామా ఉగ్రదాడిని కశ్మీరీల తిరుగుబాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి.

పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక.. ‘‘కశ్మీర్‌లో వేల సంఖ్యలో పౌరులు చనిపోవడానికి పాకిస్తానే కారణమని న్యూఢిల్లీ(ఇండియా) ఆరోపిస్తోంది. అయితే, ఇస్లామాబాద్(పాక్) ఈ ఆరోపణలను ఖండించింది. కశ్మీరీల స్వీయ నిర్ణయ హక్కుకు దౌత్య సంబంధిత మద్దతు మాత్రమే పాకిస్తాన్ ఇస్తోంది..’’ అని పేర్కొంది.

- Advertisement -