28.2 C
Hyderabad
Monday, November 23, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

- Advertisement -

దులే: మహారాష్ట్రలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దులే జిల్లా దొండైచ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు-కంటెయినర్ ఒకదాన్నొకటి వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ఔరంగాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు.

- Advertisement -