సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రిమోట్ మోడీ చేతిలో ఉందని ఆరోపించారు. బీజేపీతో నిజంగా పోరాడుతోంది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
నల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని మోడీ అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్నారు. రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారని అన్నారు.
మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్..
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదు. దీనికి తోడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. దీంతో పేదలు, మధ్యతరగతి, చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీకి ఇక్కడి సీఎం కేసీఆర్ మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో ఉంది. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు. రఫేల్ కుంభకోణంపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని రాహుల్ ప్రశ్నించారు.
దేశంలోని దొంగలకు ప్రధాని మోడీ చౌకీదార్‌గా ఉన్నారు. అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీలకు మోడీ చౌకీదార్‌గా ఉన్నారు. యువతకు ఏటా 2 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తానని మోసం చేశారు. పేదలు, రైతులకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేస్తుంది. మేం అధికారంలోకి రాగానే పేదరికంపై మెరుపుదాడులు చేస్తాం. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.72వేలు వేస్తాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
చదవండి: చంద్రబాబుపై విమర్శలు చేసిన వైఎస్ భారతి: సింహాద్రిపురంలో ప్రచారం








