25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీ విజయం కంటే ఓటమి చరిత్రలో నిలిచిపోనుంది: మాయావతి

మోడీ విజయం కంటే ఓటమి చరిత్రలో నిలిచిపోనుంది: మాయావతి

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ వారణాసిలో ఓడిపోబోతున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి జోస్యం చెప్పారు. మోడీ కనుక వారణాసిలో ఓటమి పాలైతే ఆ పరాజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

గుజరాత్ మోడల్ అభివృద్ధిపై మాయవతి విమర్శలు గుప్పించారు. నిజానికి అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పేదరికం, నిరుద్యోగం, వెనకబాటుతనం తదితర వాటిని పారదోలడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

చదవండి: సీఈసీ చూపిన ఆధారాలతో దిక్కుతోచని స్థితి లో బాబు!

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో వెనకబాటుతనం అలానే ఉందని అన్నారు. మోడీ-యోగి సారథ్యంలో రెండు ఇంజిన్ల ప్రభుత్వం దేశంలో మతఘర్షణలు, హింస సృష్టించడం తప్ప మరేమీ చేయలదేన్నారు. మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారైనా ఇద్దరూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూనే ఉన్నారని మాయావతి ఆరోపించారు.

‘‘రాయబరేలీ రిపీట్ అవుతుంది..’’

వారణాసిలో కనుక మోడీ ఓడిపోతే అది ఆయన విజయం కంటే చారిత్రాత్మకం అవుతుందని అన్నారు. 1977లో రాయబరేలీలో జరిగిందే ఇప్పుడు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి ఓటమి పాలైన విషయాన్ని మాయవతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చదవండి: మోడీజీ.. ఆ ఫేసేంటి?.. ఓటమి కనిపిస్తోందా?: ప్రధాని మీడియా సమావేశం అనంతరం విపక్షాల ఎద్దేవా…
- Advertisement -