
న్యూజెర్సీ: ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (80) నిన్న కన్నుమూశారు. దాదాపు 80 ఏళ్లుగా గాయకుడిగా, సంగీత గురువుగా శాస్త్రీయ సంగీతానికి ఆయన విశేష సేవలు అందించారు.
అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ తెలిపారు. హరియాణాలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన జస్రాజ్ 28 జనవరి 1930న జన్మించారు.
శాస్త్రీయ సంగీత ఝరిలో కోట్లాదిమంది ప్రజలను ఓలలాడించిన పండిట్ జస్రాజ్.. ఎంతోమంది సంగీత కళాకారులు, గాయకులను ఈ దేశానికి అందించారు.
ప్రముఖ సంగీత కళాకారులైన సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామనాథ్, బాలీవుడ్ నటి సాధనా సర్గమ్ వంటి వారు ఆయన శిష్యులే.
జస్రాజ్ మృతికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన మృతి భారత సాంస్కృతిక రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
The unfortunate demise of Pandit Jasraj Ji leaves a deep void in the Indian cultural sphere. Not only were his renditions outstanding, he also made a mark as an exceptional mentor to several other vocalists. Condolences to his family and admirers worldwide. Om Shanti. pic.twitter.com/6bIgIoTOYB
— Narendra Modi (@narendramodi) August 17, 2020
New Jersey








