‘నోట్ల రద్దు’కు నేటితో రెండేళ్లు! చాలా ప్రయోజనాలు కలిగాయి: అరుణ్ జైట్లీ సమర్థింపు

notes demonetisation2
- Advertisement -

Arun Jaitley on notes demonetisation

న్యూఢిల్లీ: నవంబర్ 8, భారతీయులకు ఇది మర్చిపోలేని రోజు.  దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక నిర్ణయం ప్రకటించిన రోజు.  నవంబర్ 8 2016 అర్ధరాత్రి నుంచి పెద్దనోట్లు అయిన  రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. ఇది జరిగి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు.

దేశంలోని నల్లధాన్ని రూపుమాపడం, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామంటూ నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే ఈ పెద్దనోట్ల రద్దు ప్రభావం వివిధ రంగాలపై నేటికీ కొనసాగుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

పెద్దనోట్లను రద్దు చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఢిల్లీలో గురువారం దీనిపై స్పందించారు. నోట్ల రద్దును సమర్థిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజల డబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఒక పద్ధతి గల ఆర్థిక వ్యవస్థను రూపొందించడం కోసమే నోట్లను రద్దు చేశామని జైట్లీ పేర్కొన్నారు.

notes demonetisation

పన్ను ఎగవేతలు తగ్గాయి..

నోట్ల రద్దు దగ్గర నుంచి పన్నులు ఎగవేయడం తగ్గిందని.. దేశాన్ని డిజిటల్‌ లావాదేవీల వైపు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల పన్ను ఆదాయం, పన్ను చెల్లింపులు పెరుగుతాయని అరుణ్‌ జైట్లీ వివరించారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 20 శాతం వరకు పెరిగాయని, ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా వృద్ధి నమోదు చేశాయంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నోట్ల రద్దు అత్యంత ముఖ్యమైనది. ముందుగా భారత్‌ వెలుపల దాగి ఉన్న నల్లధనాన్ని ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. పన్నుల చెల్లింపుల ద్వారా ఈ డబ్బును దేశంలోకి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలా చెల్లించని వారిపై నల్లధనం చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. విదేశాల్లో భారతీయులకున్న బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు..’’ అని అరుణ్‌ జైట్లీ ఆ పోస్టులో పేర్కొన్నారు.

 

- Advertisement -