న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పర్యటించనున్నారు. మొదట మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న బీజేపీ బహిరంసభలో మాట్లాడనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం ఆయన కర్నూలులో పర్యటించనున్నారు.
తెలంగాణ, ఏపీలో తన పర్యటనపై ట్విట్టర్ వేదికగా తెలుగులో ప్రజలను ఆహ్వానించారు. ‘మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను నేటి బహిరంగ సభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నాను… ప్రజల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పదలచుకున్నాను’ అని ట్విట్టర్ వేదికగా మోడీ వ్యాఖ్యానించారు.
ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను.
మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది.
యువత కలలు నెరవేర్చటానికి నేను ఆంధ్ర ప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
— Narendra Modi (@narendramodi) March 29, 2019
‘భారత ప్రజలంతా ఎన్డీయే మిత్ర పక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలచుకున్నాను..’ అంటూ మరోట్వీట్ చేశారు. ఇక తన ఏపీ పర్యటనపై ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తానని చెప్పుకొచ్చారు.
మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను నేటి బహిరంగ సభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నాను.
ప్రజల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పదలచుకున్నాను. @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) March 29, 2019
‘మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది.. యువత కలలు నెరవేర్చటానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అంటూ మరో ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.