షియోమీ నుంచి వచ్చేస్తున్న ‘ఎంఐ ఎ3’.. టీజర్ రిలీజ్

6:02 pm, Mon, 12 August 19

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి త్వరలోనే తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ ఎ3’ రాబోతోంది. త్వరలోనే దీనిని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ సోమవారం వెల్లడించారు. దీంతో పాటు ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు.

1:23 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి స్పెసిఫికేషన్లు వెల్లడి కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎంఐ ఎ3 ధర అధికారికంగా వెల్లడికానప్పటికీ 64జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.19,800 ఉండే అవకాశం ఉంది. అలాగే, 128 జీబీ వేరియంట్ ధర రూ.22,200గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఆడ్రాయిడ్ పై ఓఎస్, 6.08 అంగుళాల హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 665 ఎస్ఓసీ చిప్‌సెట్, 4జీబీ ర్యామ్, 48+8+2 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.