నటి కృతిక తనపై జరిగిన లైంగిక దాడిని కన్నీటితో బయట పెట్టింది. క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా తనపై అత్యాచారం చేయబోయాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. ‘‘నన్ను మంచం మీదకు తోసి.. బలవంతంగా నా ఫ్యాంట్ విప్పి అత్యాచారం చేయబోయాడు..’’ అంటూ తనపై జరిగిన లైంగిక దాడిని తలచుకుని కన్నీరు పెట్టింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం ఓ ఆడిషన్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానను కలిశాను. ‘‘నీకు సినిమా అవకాశలు ఇస్తే నాకొచ్చేదేమిటీ?’’ అని అతడు అడిగాడు. ‘‘ఇండస్ట్రీకి తెలిసిన వ్యక్తి అని మీ దగ్గరికి వచ్చా.. ’’అని నేను సమాధానం ఇచ్చాను. అయితే నా సమాధానం అతడికి నచ్చలేదు.
‘‘నీకు అవకాశం ఇస్తే నాకు ఏమిస్తావ్?’’ అంటూ పదే పదే అడిగాడు. అంతేకాదు.. ‘‘నీకు అవకాశాలు కావాలంటే కొద్ది రోజులు నువ్వు నా ఇంట్లో ఉండాలి..’’ అన్నాడు. అతని భార్య కూడా ఉంటుందనే ధైర్యంతో అందుకు ఒప్పుకున్నా. అయితే, ఇంట్లో పదే పదే నన్ను ఎగతాళి చేసేవాడు. ‘‘నువ్వు చాలా సన్నగా ఉన్నావు. సినిమాకి అసలు పనికి రావు..’’ అంటూ కించపరిచేవాడు.
అతడి ఇంట్లో ఉన్నన్ని రోజులూ.. తనతో కలిసి స్మోక్ చేయాలని, డ్రింక్ చేయాలని ఒత్తిడి చేసేవాడని నటి కృతిక వివరించింది. క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా చాలా మంచి వ్యక్తి అని చాలామంది అంటారని, ఇకనైనా అతడి నిజ స్వరూపం తెలుసుకోవాలని, అతణ్ని రక్షించే ప్రయత్నం చేయొద్దని ఆమె వేడుకుంది.
అత్యాచారం చేయబోయాడు…
‘‘ఓ రోజున.. లవ్ రాజన్ అసిస్టెంట్‌ను కలవడానికి వెళ్దామని చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే తలుపులేసి నన్ను బెడ్ మీదకు తోశాడు. బలవంతగా నా ప్యాంటు కిందకు లాగేసి మీద పడి అత్యాచారం చేయబోయడు. నన్ను వదిలిపెట్టు అని వేడుకున్నా అతడు ఒప్పుకోలేదు. మరింత మీదకు వచ్చి ఒత్తిడి చేయబోయాడు. నేను ఇతరులతో పడుకుని అవకాశాలు సంపాదించాలని రాలేదని, నీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పడంతో విక్కీ సిదానా వదిలి పెట్టి.. వెళ్లిపోమ్మన్నాడు..’’ అంటూ కృతిక చెప్పుకొచ్చింది.