రామ్‌పూర్: ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ఎన్నికల ప్రచార సభలో కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె.. ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ..‘నా పుట్టిన రోజు కానుకగా బీజేపీ నాకు రామ్‌పూర్ టికెట్‌ను బహుమతిగా ఇచ్చింది. దీని ద్వారా నాకు మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. కానీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అజాంఖాన్ నామీద ఎన్నో ఆరోపణలు చేశారు. నన్ను రామ్‌పూర్ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే యాసిడ్ దాడులు చేస్తామని బెదిరించారు’ అంటూ కంటతడి పెట్టారు.
జయప్రదకు మద్దతుగా..
వెంటనే అక్కడున్న బీజేపీ వేదిక వద్దకు వచ్చి ఆమెను ఓదార్చారు. జయప్రదకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జయప్రదకు మద్దతుగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. కాగా, కొంత సేపటి తర్వాత మళ్లీ జయప్రద తన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘తొలిసారి నా వెనక బీజేపీ బలం ఉంది. ఇంతకు ముందులా ఇంకెప్పుడూ నేను ఏడవను. నాకు బతికేహక్కుంది. బతుకుతాను కూడా. ఎవ్వరు నన్నేమీ చేయలేరు. బీజేపీలో చేరతానంటే నన్ను కొందరు హెచ్చరించారు. కానీ, ప్రజాసేవకు ఈ పార్టీయే నాకు మంచిదనిపించింది. నేను గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాను. దీంతోపాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి’ అని జయప్రద వ్యాఖ్యానించారు.
చదవండి : వైఎస్ జగన్‌పై భారీ కుట్ర! బయటపడిన నిఘా వ్యవస్థ…








