25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సార్వత్రిక ఎన్నికలు 2019: విడుదలైన షెడ్యూల్, తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న…

సార్వత్రిక ఎన్నికలు 2019: విడుదలైన షెడ్యూల్, తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న…

chief election commissioner sunil arora
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు మొదలవనున్నాయి.  మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో లోక్‌సభ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ తేదీలు తదితర వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్‌ అరోరా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసింది.  

ఏప్రిల్, మే నెలల్లోనే ప్రక్రియ మొత్తం ముగిసేలా మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల హడావిడి దాదాపు రెండు నెలల పాటు కొనసాగనుంది. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (175), ఒడిశా (147), సిక్కిం (32), అరుణాచల్ ప్రదేశ్ (60) అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం… దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  2014 నుంచి ఇప్పటివరకూ 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 10 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలు మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో ముగియనున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలోనూ తొలివిడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

ఇక లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్లకు ఆఖరి తేది మార్చి 25 కాగా, మార్చి 26న నామినేషన్లను పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 ఆఖరి తేదీ. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. 

దశల వారీగా ఎన్నికల షెడ్యూల్ ఇలా..

ఫేజ్ 1: ఏప్రిల్ 11 – 22 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాలు 

ఫేజ్ 2: ఏప్రిల్ 18 – 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాలు 
ఫేజ్ 3: ఏప్రిల్ 23 – 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాలు 
ఫేజ్ 4: ఏప్రిల్ 29 – 9 రాష్ట్రాల్లో 71 నియోజకవర్గాలు 
ఫేజ్ 5: మే 6 – 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలు 
ఫేజ్ 6: మే 12 – 7 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు 
ఫేజ్ 7: మే 19 – 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు 

- Advertisement -