మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు….

7:49 am, Mon, 6 May 19
KCR Latest News, Telangana Election News, Telangana News, Newsxpressonline

 

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా నేడు  కేరళ సీఎం పినరయి విజయన్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు.

త్రివేండ్రంలో ఈరోజు సాయంత్రం 6గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యి… ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక కేరళ పర్యటన అనంతరం కేసీఆర్….ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పర్యటిస్తారని సమాచారం.

అదేవిధంగా ఎన్నికల ఫలితాల రాబోయే ముందు రోజు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకి కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే గత సంవత్సరం ఆయన…పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడలతో భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుతుండటంతో….ఫెడరల్ ఫ్రంట్ యాత్ర చేపడుతున్నారు. చూడాలి మరి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్ ఏ మేర విజయం సాధిస్తారో…?

చదవండి:లోకేష్ కి షాక్ ఇస్తున్న తమిళ పత్రిక కధనం…!