31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అశ్లీలత పెరిగిపోతోంది! ‘టిక్‌టాక్’ను నిషేధించాలని కేంద్రానికి మద్రాసు హైకోర్టు ఆదేశం

అశ్లీలత పెరిగిపోతోంది! ‘టిక్‌టాక్’ను నిషేధించాలని కేంద్రానికి మద్రాసు హైకోర్టు ఆదేశం

- Advertisement -

చెన్నై: ‘టిక్‌టాక్’ యాప్‌ను పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ యువత వరకు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. గత కొద్దికాలంలోనే చైనాకు చెందిన ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. వాట్సాప్‌ స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లు.. ఇలా ఎక్కడ చూసిన టిక్‌టాక్‌ వీడియోలే దర్శనమిస్తున్నాయి.

అయితే వీటి వల్ల అశ్లీలత పెరిగిపోతోందని, దీన్ని నిషేధించాలని ఇప్పటికే పలువురు కోరారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అశ్లీలత పెరిగిపోతోంది..

ఈ యాప్‌ అశ్లీలతను ప్రోత్సహిస్తోందని, దీని వల్ల కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ముత్తు కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది.

అంతేగాక, ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాను ఆదేశించింది. చిన్నారులు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా నిబంధనలు తీసుకొస్తారా లేదా అన్నదానిపై ఏప్రిల్‌ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ కారణంగా పిల్లలు, యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కాగ,పెదాల కదలికతో సినిమా డైలాగ్‌లకు అభినయించడం, పాటలకు డ్యాన్స్‌లు చేయడం వంటి ఫీచర్లతో వచ్చిన ఈ టిక్‌టాక్ యాప్‌ చాలా కొద్దికాలంలోనే విశేషాదరణ పొందింది. అయితే దీని వల్ల యువత చెడుదారులు పట్టే ప్రమాదం ఉందని, దీన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.

చదవండి: కొడుకు బర్త్‌డే కి తాత ఇచ్చిన గిఫ్ట్‌కి షాకైన అల్లు అర్జున్!

- Advertisement -