వీడిన ఉత్కంఠ: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలు

Ravant
- Advertisement -

Ravant

న్యూఢిల్లీ: కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. త్వరలోనే అంసెంబ్లీ పదవీకాలం ముగియనున్న ఛత్తీస్‌గఢ్,  మధ్యప్రదేశ్,  మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వుంది, ఇవాల్లి నుంచే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 15లోగా పూర్తవుతాయని ఓపీ రావత్ ప్రకటించారు. అన్ని రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం జనవరి 15కు ముందే పూర్తవుతాయని చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇలా…

ఛత్తీస్‌గఢ్: రెండు విడతల పోలింగ్ నిర్వహణ.

తొలిదశలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు, అక్టోబర్ 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే నెల 23తో నామినేషన్‌ల ప్రక్రియ ముగుస్తుంది. 26వ తేదీతో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 12 తేదిన జరుగుతుంది

రెండోవ విడత 72 నియోజకర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2 తేదీతో నామినేషన్‌ల ప్రక్రియ ముగుస్తుంది. 5వ తేదీతో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది

మధ్యప్రదేశ్, మిజోరం: ఒకే విడత పోలింగ్. రెండు రాష్ట్రల్లో నవంబర్ 28న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 14తో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది

రాజస్థాన్, తెలంగాణ: ఒకే విడత పోలింగ్ డిసెంబర్ 7 పోలింగ్ జరుగుతుంది, నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబర్ 22తో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది

ఎన్నికల ఫలితాలు: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.

- Advertisement -