ఉద్రిక్తతలను మరింత పెంచొద్దు.. మోదీ లడఖ్ పర్యటనపై చైనా ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ లడఖ్ పర్యటనపై డ్రాగన్ కంట్రీ చైనా స్పందించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే వాతావరణాన్ని ఎవరూ సృష్టించకూడదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వాతావరణం నేపథ్యంలో ఆ వేడిని తగ్గించడానికి దౌత్యపరమైన, సైనిక పరమైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం లడఖ్‌లో అకస్మాత్తుగా పర్యటించారు.

గల్వాన్‌లో లోయలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణాత్మక వైఖరి చోటు చేసుకున్న తరుణంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది.

- Advertisement -