
ఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు అవుతున్న మహాకూటమిలో పార్టీలు అన్నింటిని ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ….చంద్రబాబు మహాకూటమిలోని కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నిన్న ఢిల్లీకి వెళ్ళి చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం చంద్రబాబు… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
చదవండి: బీజేపీ, ఆరెస్సెస్ నేతలంతా గాడ్సే లవర్స్: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…
వీరితో ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు అవసరమైన కసరత్తుపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు నేటి ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశం అవుతారు.
కుదిరితే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో కూడా సమావేశం కానున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం లక్నో చేరుకుని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయి ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చిస్తారు.








