24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జగన్‌తో అంటకాగుతారా? అసహ్యంగా లేదూ..: ప్రధాని మోడీపై చంద్రబాబు

జగన్‌తో అంటకాగుతారా? అసహ్యంగా లేదూ..: ప్రధాని మోడీపై చంద్రబాబు

Chandrababu Latest News, YS Jagan Latest News, Modi News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. మోడీ రాజమహేంద్రవరం పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధించారు.

రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి.. మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గు వెయ్యడం లేదా? అని చంద్రబాబు అని నిలదీశారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్థిక నేరస్థులతో అంటకాగుతున్నారంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అసహ్యంగా లేదూ..

బ్యాంకులను దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తారా? చంద్రబాబు నిలదీశారు. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. ‘మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ..’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఈ దుర్మార్గపు పరిపాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ, రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు.

చదవండి: కేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

- Advertisement -