
- Advertisement -
భోపాల్: దళిత మహిళపై బీజేపీ నేత అత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో వెలుగుచూసింది. అశోక్‌నగర్ జిల్లాకు చెందిన దేవేంద్ర తమ్రాకర్ బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు సింగ్రౌలీ జిల్లాలో ఉన్నవ్యవసాయ క్షేత్రంలో ఓ దళిత మహిళ భర్త కూలీగా పనిచేసేవాడు.
తనకు ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించిన దేవేంద్ర కారులో తన భర్తతో సహా సింగ్రౌలీకి తీసుకువచ్చాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దారిలో దాబా వద్ద తన భర్తకు మద్యం తాగించాడని, అనంతరం తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది.
అనంతరం పోలీసులకు చెబితే తీవ్ర పరిణామా ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవేంద్రను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
- Advertisement -








