22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మరింత క్షీణించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు చేరుకున్న ఉమాభారతి

మరింత క్షీణించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు చేరుకున్న ఉమాభారతి

- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జైట్లీ ఇటీవల కొంత కోలుకున్నట్టు కనిపించారు.

గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. అయితే, శుక్రవారం ఆరోగ్యం మరింత విషమించినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఆసుపత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

జైట్లీని ఇప్పటి వరకు పరామర్శించిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్, రామ్‌విలాస్ పాశ్వాన్, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, జ్యోతిరాధిత్య సింధియా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు ఉన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్య వల్ల పోటీ చేయలేదు. ఈ ఏడాది మే నెలలో ఆయన మూత్రపిండ మార్పిడి చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేరారు. సెప్టెంబర్ 2014లో జైట్లీ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. 2018 మే నెల నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -