25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఇఫ్తార్ విందుపై వివాదాస్పద ట్వీట్ చేసిన కేంద్రమంత్రి…మందలించిన అమిత్ షా             

ఇఫ్తార్ విందుపై వివాదాస్పద ట్వీట్ చేసిన కేంద్రమంత్రి…మందలించిన అమిత్ షా             

- Advertisement -

ఢిల్లీ: ఎప్పుడు ఏదొక వివాదం కొనితెచ్చుకునే బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్…ఇఫ్తార్ విందుపై ఓ వివాదాస్పద ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తమ మిత్రపక్షనేతలు అయిన…బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎల్‌జేపీ చీఫ్, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌లు హాజరైన ఇఫ్తార్ విందుకు సంబంధించి గిరిరాజ్ సింగ్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు.

ఇఫ్తార్ విందులో కనబరుస్తున్న జోరును నవరాత్రి ఉత్సవాల్లో  ఎందుకు చూపించరంటూ గిరిరాజ్ ప్రశ్నించారు. అయితే ఇదే ఉత్సాహం నవరాత్రి ఉత్సవాల్లోనూ చూపిస్తే ఆ ఫొటోలు ఇంకా బాగుంటాయంటూ ఫొటోలు కూడా ట్వీట్ చేశారు.

ఇక గిరిరాజ్ ట్వీట్‌పై మిత్రపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గిరిరాజ్ ట్వీట్‌పై అమిత్ షా వెంటనే స్పందించారు. గిరిరాజ్‌ను పిలిపించుకుని.. అనవసర ప్రకటనలు చేసి పార్టీని, మిత్ర పక్షాలను ఇరుకున పెట్టవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. మరోసారి ఇటువంటి ప్రకటనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని  హెచ్చరించారు.

చదవండి: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి…
- Advertisement -