- Advertisement -
ముంబై: దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేశ్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే కదా! ఈ నెల 30న శ్లోకా మెహతాతో ఆకాష్ నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి కుదిరిందో లేదో ముఖేశ్ అంబానీ సెలబ్రిటీలకు గోవాలో పెద్ద పార్టీ కూడా ఇచ్చేశారు. తాజాగా కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు అతిథులను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో షెహనాయీ సాంగ్‌తో ఈ వీడియో ఇన్విటేషన్‌ను రూపొందించారు. అంబానీ ఇంట్లోనే వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఆకాశ్, శ్లోకాలు స్కూల్ నుంచే మంచి స్నేహితులు. శ్లోకా డైమండ్ వ్యాపారి రసెల్ మెహతా కూతురు. ఇక వీరి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది. మరోవైపు ముఖేశ్ కూతురు ఈషా అంబానీకి కూడా వివాహం కుదిరింది. అంటే.. డబుల్ జోష్ అన్నమాట!
- Advertisement -