25.6 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్

bharti-airtel
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో టెలికం కంపెనీలు కూడా ఆ మేరకు వ్యాలిడిటీ గడువును పొడిగించాయి.

లాక్‌డౌన్ కారణంగా రీచార్జ్ చేసుకోలేని ఖాతాదారుల ప్రీపెయిడ్ ప్లాన్ గడువును మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించాయి.

ఈ రెండు సంస్థల తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఖాతాదారులు ఇప్పుడు రీచార్జ్ చేసుకోకపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్‌కమింగ్ కాల్స్‌ను పొందవచ్చు.

- Advertisement -