23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం తమిళనాడులోని కడలూరు థర్మల్ పవర్ స్టేషన్‌లో బాయిలర్ పేలుడు!

తమిళనాడులోని కడలూరు థర్మల్ పవర్ స్టేషన్‌లో బాయిలర్ పేలుడు!

- Advertisement -

చెన్నై: తమిళనాడులోని కడలూరు థర్మల్ పవర్ స్టేషన్‌లో విషాదం గురువారం చోటుచేసుకుంది.  బాయిలర్ పేలడంతో ఎనిమిదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ప్లాంట్‌లో పేలుడు జరిగిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

తమిళనాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా మూడు చోట్ల వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ తెల్లవారుజామున విశాఖ పట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకేజీ కారణంగా 11 మంది మృతి చెందగా, వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెండో ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగింది. స్థానిక పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురియ్యారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక మూడోది – కడలూరు థర్మల్ పవర్ స్టేషన్‌లో బాయిలర్ పేలుడు.

- Advertisement -