
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు కూల్చడానికి ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. సంకీర్ణంలో ఉన్న ఎమ్మెల్యేలని లాగేసుకునేందుకు మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలోని కమలదళం చేయని ప్రయత్నాలు లేవు. అలాగే ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రయత్నించి విఫలమవుతునే ఉన్నారు.
చదవండి: కేజ్రీవాల్‌ని ఎందుకు కొట్టానో నాకే అర్ధం కావడం లేదు: సురేశ్
ఈ క్రమంలోనే మరోసారి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇక ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏం అవుతుందో వేచి చూడాలని అన్నారు. ప్రస్తుతం యడ్డీ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపాయి.
అటు యడ్డీ వ్యాఖ్యలని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ…వారిని జారిపోనీకుండా చూసుకుంటున్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..








