ట్రంప్ పదోస్సారి.. మళ్లీ తాతైన అమెరికా అధ్యక్షుడు

- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ భార్య లారా సోమవారం అర్ధరాత్రి దాటక ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎరిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ చిన్నారికి కరోలినా డోరోతి అని పేరు పెట్టారు. ఎరిక్ దంపతులకు ఇది రెండో సంతానం.  వారి మొదటి సంతానమైన ఎరిక్ ల్యూక్ ట్రంప్‌కు ఈ సెప్టెంబరుతో రెండేళ్లు నిండనున్నాయి.

 

73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు సంతానం. వీరిలో మొదటి ఇద్దరు జూనియర్‌ డొనాల్డ్‌, ఇవాంకా ట్రంప్‌. మూడో సంతానం ఎరిక్‌. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు డొనాల్డ్ జూనియర్‌తో కలిసి ఎరిక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌‌గా ఉన్నారు. ఇక, 36 ఏళ్ల లారా ట్రంప్ మాజీ జర్నలిస్ట్. ట్రంప్ 2020 రీఎలక్షన్ ప్రచారంలో సీనియర్ అధికారిగా ఉన్నారు.

- Advertisement -