పుకార్లకు నటి దివ్యవాణి ఫుల్‌స్టాప్.. టీడీపీలో చేరిక

- Advertisement -

అమరావతి: టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్న పుకార్లకు నటి దివ్యవాణి ఫుల్‌స్టాప్పట్టారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దివ్యవాణికి పార్టీ కండువా కప్పిన చంద్రబాబు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో చేరినందుకు ఆనందంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇకపై తన సమయాన్ని పార్టీ కోసమే కేటాయిస్తానని తెలిపారు. దివ్యవాణి గతేడాది నవంబరులోనే చంద్రబాబును కలిశారు. అప్పుడే ఆమె టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. తాజాగా డిసెంబరు 31న అమరావతిలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుని పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త కూడా..

నటి దివ్యవాణితోపాటు కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి దేవీ ప్రసాద్ కూడా టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఐటీ అధికారిగా పనిచేసి రిటైరైన దేవీప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -